గీతా మాధురి, ఆషులకు వచ్చిన సమస్యేంటి? ఇద్దరూ ఏక కాలంలో ఒకటే పోస్ట్..

గీతా మాధురి, ఆషులకు వచ్చిన సమస్యేంటి? ఇద్దరూ ఏక కాలంలో ఒకటే పోస్ట్..

సూపర్ సింగర్ నుంచి తన టాలెంట్‌తో స్టార్ సింగర్‌గా మారింది గీతా మాధురి. ఎన్నో సినిమాల్లో అదిరిపోయే హిట్ సాంగ్స్‌తో అలరించింది. సింగర్‌గా మంచి పామ్‌లో ఉన్నప్పుడే నటుడు నందుని ప్రేమించడం.. ఆ తరువాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడం జరిగాయి. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం గీతా మాధురి పలు సింగింగ్ షోలకు జడ్జి గా వ్యవహరించడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోంది. 

ఇక ఆషురెడ్డి.. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ షోతో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. ఉన్నది కొద్ది రోజులే అయినా కూడా తన గ్లామర్, పొట్టి పొట్టి బట్టలతో యూత్ గుండెల్లో గట్టిగానే స్థిరపడిపోయింది. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ ఫేమస్ అయిపోవడం కోసం చాలా పనులు చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో హాట్ హాట్ ఫోజులు, ఇంకా ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకుంది. ఇప్పుడు పలు వెబ్ సిరీస్, షాట్ ఫిలిమ్స్ చేస్తోంది.

ఇక ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకంటారా? ఇద్దరూ ఒకే సమయంలో ఒకేలా పోస్ట్ పెట్టారు. తాజాగా గీతా మాధురి  జీవితాన్ని ఎప్పుడూ కూడా కాంప్లికేట్ చేసుకోవద్దని.. ఇక్కడ మనం ఎప్పటి వరకు ఉంటామో తెలియదని.. అందుకే మనకున్నటువంటి ఈ సమయాన్ని విలువైన వాటి కోసం ఉపయోగించుకోవాలి తప్ప, అర్థం లేని వాటికి సమయం వృధా చేయకూడదని పోస్ట్ పెట్టింది. ఇదే పోస్టును అషు కూడా పెట్టింది. ఈ రెండు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకే కొటేషన్.. ఏక కాలంలో పెట్టడమేంటి? అసలు వీరిద్దరికీ వచ్చిన సమస్యేంటని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.