సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ వార్

సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ వార్

ఇళయ దళపతి విజయ్.. కోలీవుడ్‌ స్టార్ హీరో. అక్కడ ఆయనకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుంటారు. ఆయన సినిమాలకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. అందుకేనేమో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఎవర్ గ్రీన్ అందగాడు. ఈ మధ్య కాలంలో ఆయను ఫ్లాప్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా అసలు లేవనే చెప్పాలి. 

ఇక విజయ్ అప్పుడప్పుడు మహేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల సినిమాలను సైతం రీమేక్ చేసి హిట్ అందుకుంటూ ఉంటాడు. మహేష్ హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనిని విజయ్ గిల్లీ పేరుతో తమిళ్‌లో రీమేక్ చేసి రీసెంట్‌గా రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ విజయ్ యాక్టింగ్‌తో కంపేర్ చేసి మహేష్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు విజయ్ అభిమానులు. ఇక మహేష్ అభిమానులు ఊరుకుంటారా? విజయ్‌తో పోలిస్తే మహేష్ యాక్టింగే సూపర్బ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వార్ ప్రారంభమైంది. విజయ్ ఫ్యాన్స్ పోకిరి మూవీని కూడా పోలుస్తూ మహేష్‌ను ట్రోల్ చేస్తుంటే.. మహేష్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా విజయ్‌ను ఏకి పారేస్తున్నారు. ఈ రచ్చ ఎప్పటికి ఆగుతుందో చూడాలి.