రా ఏజెంట్‌గా ఎన్టీఆర్.. మార్కెట్ పెంచుకుంటాడా?

రా ఏజెంట్‌గా ఎన్టీఆర్.. మార్కెట్ పెంచుకుంటాడా?

టాలీవుడ్ స్టార్ హీరోలంతా పోటీ పడి మరీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో అడుగు పెట్టాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ఏక కాలంలో పాన్ ఇండియాలో అడుగు పెట్టారు. అంతేకాదు.. ఏకంగా వీరిద్దరూ నటించిన ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇంత గుర్తింపు వచ్చాక దానిని పోగొట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలూ చేస్తున్నది అదే. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ‘దేవర’.. మరొకటి ‘వార్ 2’. బాలీవుడ్‌లో వార్ 2తో సత్తా చాటాలని ఎన్టీఆర్ తాపత్రయ పడుతున్నాడు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్.. హృతిక్‌ను బీట్ చేయగలడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఇక ఇప్పటికే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఇలాంటి పాత్రలో ఇప్పటి వరకూ తారక్ నటించింది లేదు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను సక్సెస్ చేసుకుని మార్కెట్‌ను పెంచుకోవాలని తాపత్రయ పడుతున్న హీరోల్లో ఎన్టీఆర్ కాస్త వెనుకనే ఉన్నాడని చెప్పాలి. మరి వార్ 2 ఎన్టీఆర్ రేంజ్‌ను పెంచుతుందో లేదో చూడాలి.