హతవిధీ.. సలార్‌కు ఇంత చెత్త రికార్డా?

Salaar Record

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సక్సెస్ కోసం ఎంతగా తపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ‘సలార్’ సినిమాతో ఓ రేంజ్‌లో లేచాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2024ను తన ఖాతాలో వేసేసుకుంది. బాక్సాఫీస్ వసూళ్లను షేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అసలు ఈ సినిమా ముందు ఏ సినిమా కూడా నిలబడలేపోయింది. 

ఇక ప్రస్తుతం అదే జోష్‌తో ప్రభాస్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. కల్కి, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. ఈ ఏడాదే ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది. వెండితెరపై వసూళ్ల సునామీ సృష్టించిన సలార్ మూవీకి ఓ చెత్త రికార్డ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుల్లితెరపై ఈ సినిమా చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది.  

ఈ సినిమాకు బుల్లితెరపై వరస్ట్ టీఆర్పీని రాబట్టింది. ఇప్పటి వరకూ టెలివిజన్ చరిత్రలోనే థియేటర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సాధించిన సినిమాకి అత్యంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం అనేది సలార్ విషయంలోనే జరిగింది.  ‘భగవంత్ కేసరి’ సినిమా మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 9.36 రేటింగ్‌తో దుమ్ము దులిపేసింది. ఆ తరువాత ‘గుంటూరు కారం సినిమాకు ’9.25 రేటింగ్ వచ్చింది. చివరకు రామ్ హీరోగా వచ్చి థియేటర్‌లో ఫ్లాప్ అయిన స్కంద మూవీకి కూడా 8.15 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సలార్‌కు మాత్రం కేవలం 6.15 రేటింగ్ మాత్రమే వచ్చింది.

Google News