భారీ అవకాశం వచ్చినా నో చెప్పిన శ్రీలీల.. కారణమేంటంటే..

భారీ అవకాశం వచ్చినా నో చెప్పిన శ్రీలీల.. కారణమేంటంటే..

టాలీవుడ్‌లో పెళ్లి సందడి చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా ఫ్లాప్‌తో సంబంధం లేకుండా షార్ట్ పిరియడ్‌లోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న హీరోయిన్ శ్రీలీల. డ్యాన్స్‌తో పాటు అందం కూడా ఉండటంతో యూత్ గుండెల్లో తిష్ట వేసేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తర్వాత అమ్మడికి ఓ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఇతర భాషల దర్శక నిర్మాతల చూపు సైతం అమ్మడిపై పడింది. 

అయితే రవితేజ సరసన నటించిన  ఢమాకా చిత్రం హిట్‌ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్‌ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్‌ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా ఇదర భాషల్లోనూ అవకాశాలను అందిపుచ్చకుని మంచి క్రేజ్‌ను సంపాదించింది. 

భారీ అవకాశం వచ్చినా నో చెప్పిన శ్రీలీల.. కారణమేంటంటే..

విజయ్‌ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గోట్. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో ఎందరో అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్.. ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రష్యాలో జరుగుతోంది.  అయితే ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కోసం త్రిషను చిత్ర యూనిట్ తీసకుంది. కానీ కాల్ షీట్స్ కారణంగా త్రిష తప్పుకోవడంతో ఆ అవకాశం శ్రీలలను వరించిందట. కానీ శ్రీలీల కూడా దీనికి నో చెప్పేసిందట. దీనికి కారణం ఏంటంటే.. కోలీవుడ్‌లో ఎంట్రీయే సింగిల్ సాంగ్‌తో ఇస్తే ఇబ్బంది అవుతుందని వెనుకడుగు వేసిందట.