పుష్ప 2 నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

పుష్ప 2 నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం బన్నీ, సుక్కులు తెగ కష్టపడుతున్నారు. ఈ సినిమా పుష్పను మించి ఉండాలి తప్ప దానికి ఏమాత్రం తగ్గకూడదని నానా తంటాలు పడుతున్నారు. పైగా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ అంచనాలకు తగ్గితే కష్టమేనని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని చిత్ర యూనిట్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే మేనరిజం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 లో కూడా అలాంటి మరొక మ్యానరిజంతో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. తగ్గేదేలే అంటూ మన దేశంలోనే కాకుండా వేరే ఇతర దేశాల్లోనూ చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ చేశారు.

ఇప్పుడు పుష్ప 2 సినిమాలో తగ్గేదేలే అనే మాటతో పాటు మరొక మేనరిజమ్‌ను కూడా ఈ సినిమాలో వాడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఆ మ్యానరిజం అయితే థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మేనరిజం మాత్రమే కాదు.. పుష్ప 2లో గూస్ బంప్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని టాక్. ఈ సినిమా కోసం బన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ రూ.150 కోట్లు తీసుకున్నాడంటూ టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.