మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్‌.. ఫ్యాన్స్‌కు పండగే..

మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్‌.. ఫ్యాన్స్‌కు పండగే..

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఏడాదికి రెండు సినిమాల చొప్పున విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆయనకు సంబంధించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇక వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు.  ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు.

విశ్వంభర సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో చిరు పలు డిఫరెంట్ రోల్స్‌లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా చివరలో 15 నిమిషాలు చాలా కీలకమట. ఈ ఎండింగ్ పార్ట్‌లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందట. దాని కోసం ముందుగా తమిళ్ హీరోని తీసుకోవాలని భావించారట.

మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్‌.. ఫ్యాన్స్‌కు పండగే..

అయితే ఓ తమిళ స్టార్ హీరో చిరు మూవీ అనగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట కానీ ఆక్ష్న కాల్ షీట్స్ రెండేళ్ల వరకూ ఖాళీగా లేవట. దీంతో ఈ కీలక పాత్ర కోసం పవన్ కల్యాణ్‌ తీసుకుంటే బాగుంటుందని డైరెక్టర్ వశిష్ట భావించారట. చిరు కూడా పవన్ సెట్ అవుతారని ఫీలయ్యారట. దీంతో వెంటనే పవన్‌కు డైరెక్టర్ వశిష్ట స్క్రిప్ట్ చెప్పాలని భావించారట. విషయం తెలుసుకున్న పవన్ స్క్రిప్ట్ చెప్పనవసరం లేదని.. అది ఏ క్యారెక్టర్ అయినా తకు ఓకే అని తన అన్న చిరుకి చెప్పారట. ఏపీ ఎలక్షన్స్ తర్వాత పవన్ షూటింగ్ ఉండేలా చూడమని వశిష్టకు చిరు సూచించినట్టు సమాచారం. మొత్తానికి ఈ వార్త నిజమైతే మాత్రం మెగా అన్నదమ్ములను ఒకే స్క్రీన్‌పై ఫ్యాన్స్ చూడటం ఖాయమైనట్టే.

Google News