ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

ఒక ప్రముఖ నటుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు త్రిషను చాలా బాధించాయి. తాను ఇప్పటి వరకూ ఆ నటుడితో నటించలేదని.. ఇక ముందు కూడా నటించబోనని స్పష్టం చేసింది. ఆయన మరెవరో కాదు.. తమిల నటుడు మన్సూర్ అలీఖాన్. ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా నిలిచాడు. మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్లతో బెడ్ సీన్లలో నటించానన్నాడు. 

అంతటితో ఆగితే బాగానే ఉండేది.. ‘లియో’ మూవీలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో తనకు బెడ్ రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాడట. కానీ ఆ సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డానని.. అసలు కశ్మీర్ షెడ్యూల్ పూర్తయ్యే వరకూ కూడా త్రిషను చూసే అవకాశమే దక్కలేదని బాగా ఫీలైపోయాడు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. త్రిషకు సైతం ఈ వ్యాఖ్యలు చేరాయి. దీనిపై త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

మన్సూర్ అలీఖాన్ తన గురించి మాట్లాడిన వీడియో తన దృష్టికి వచ్చిందని.. దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. మన్సూర్ లాంటి వ్యక్తులతో నటించకపోవడం సంతోషంగా ఉందని.. భవిష్యత్‌లోనూ నటించబోనని త్రిష స్పష్టం చేసింది. ఇలాంటి వారి వల్లే మానవాళికి చాలా బ్యాడ్ నేమ్ వస్తోందని తెలిపింది. త్రిష వ్యాఖ్యలపై స్పందించిన మన్సూర్ అలీఖాన్.. తనకు త్రిష అంటే చాలా గౌరవమని.. తాను సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలు ఇంతటి దుమారానికి కారణమవుతాయని భావించలేదన్నాడు. తన మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపాడు.