‘కల్కి’ సినిమాలో ప్రభాస్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ న్యూస్..

‘కల్కి’ సినిమాలో ప్రభాస్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ న్యూస్..

ఇండస్ట్రీలోని సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా ఒక ఎత్తు. ప్రభాస్ సినిమా కోసమే కాదు.. ఆయన సినిమాల నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రభాస్ సినిమాల్లో ఎలివేషన్స్ కారణమో మరొకటో కానీ ప్రభాస్ సినిమాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సలార్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నెక్ట్స్ కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కల్కి మూవీపై అంచనాలైతే ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమనే టాక్ ఇప్పటికే నడుస్తోంది. దీనికి కారణం.. ప్రభాస్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండటమే. ఇప్పటి వరకూ ప్రభాస్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చేసింది లేదు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనుందని ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు.

‘కల్కి’ సినిమాలో ప్రభాస్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ న్యూస్..

ఇక ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఉంటుందట. సినిమా సెటప్ కోసం దర్శకుడు 15 నిమిషాల టైం తీసుకున్నట్టు టాక్. మరి అంతసేపు ప్రభాస్ ఎంట్రీ లేకుంటే ఫ్యాన్స్‌కు నచ్చుతుందా? ఆ పదిహేను నిమిషాలను ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 15 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీతో సినిమా ఓ లెవల్‌కు వెళ్లిపోతుందని టాక్.