వామ్మో.. సాయిపల్లవి భారీ రెమ్యూనరేషన్ తీసుకోనుందా?

వామ్మో.. సాయిపల్లవి భారీ రెమ్యూనరేషన్ తీసుకోనుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను చేసిన ప్రతి సినిమాతోనూ మెప్పించిన హీరోయిన్ సాయిపల్లవి. అమ్మడులో ఉన్న కొన్ని సుగుణాలు ఆమెను ఎక్కడో నిలిపాయి. ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లదు. మంచి సినిమాలు అది కూడా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటే మాత్రమే చేస్తుంది. డబ్బుల కోసమో.. పేరు కోసమో ఆత్రపడదు. అందుకే అమ్మడిపై ప్రేక్షకుల్లో అభిమానం చాలా ఎక్కువ.

ప్రస్తుతం సాయిపల్లవి నాగచైతన్య హీరోగా రూపొందుతున్న తండేల్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో పాటు సాయిపల్లవి చేతిలో మరో భారీ బడ్జెట్ మూవీ కూడా ఉంది. అదే.. రామాయణం. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో నటించనుండగా సాయిపల్లవి సీత పాత్రలో నటించనుందని టాక్. ఇక కేజీఎఫ్ హీరో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సాయిపల్లవి తీసుకోయే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఒక స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. ఇక సాయిపల్లవి రామాయణం కోసం ఏకంగా రూ.50 కోట్లు తీసుకుంటోందని సమాచారం. ఇంత భారీ మొత్తంలో సాయి పల్లవి రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందనే తెలియాలి.