బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

బిగ్‌బాస్ సీజన్ 7 ఇటీవలే ముగిసింది. ఈ సీజన్ ముగిసిన తర్వాత కూడా విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా ఒకచోట చేరి సందడి చేయడం వంటివి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా శివాజీ కూడా పల్లవి ప్రశాంత్, యావర్ సహా కొందరు కంటెస్టెంట్స్‌తో కలిసి భోజనం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చి తెగ వైరల్ అవుతోంది.

ఇక బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్స్‌లో ప్రియాంక జైన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తరువాత బిగ్‌బాస్ అవకాశాన్ని సంపాదించింది. ఈ షోలో ప్రియాంక చాలా సందడి చేసింది. అద్భుతంగా టాస్కులు ఆడింది. కాంట్రవర్సీలకు కాస్తంత దూరంగానే ఉంది. ఒక్క ఫ్రెండ్‌షిప్ విషయంలో కొంత నెగిటివిటీని ఎదుర్కొంది తప్ప మిగిలినదంతా ఓకే. అందుకే టాప్‌ 5 వరకూ నిలదొక్కుకోగలిగింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

ఫ్యామిలీ వీక్‌లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సందడి చేసి వెళ్లిన విషయం తెలిసిందే. అమ్మడు మౌనరాగం సీరియల్ చేస్తున్న సమయంలో ఆ సీరియల్ హీరో శివ్ కుమార్‌తో ప్రేమలో పడిపోయింది. ఫ్యామిలీ వీక్‌లో ప్రియాంక తరుఫున శివ్ వచ్చాడు. వీరిద్దరి రొమాన్స్.. పెళ్లెప్పుడు చేసుకుందామంటూ పదే పదే ప్రియాంక శివ్‌ని అడగడం తెగ వైరల్ అయ్యాయి. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ప్రియాంక ఆ ఊసే లేదు. తాజాగా నెటిజన్స్ ఆమెను శివ్‌తో పెళ్లెప్పుడని అడగ్గా.. ఆ క్వశ్చన్ అతడిని అడగాలని తన చేతిలో ఏమీ లేదని చెప్పేసింది. హౌస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడే పెళ్లి చేసుకుందామని శివ్‌ను అడిగిన ప్రియాంక ఇలా మాట మార్చడంతో అంతా షాకవుతున్నారు.