IT Raids: మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ, సుకుమార్ నివాసాలపై ఐటీ దాడులు..
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మూత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ కూడా ఒకటి. తాజాగా ఈ సంస్ధతో పాటు మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నినాసాలలో సైతం ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ నివాసంలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ.700 కోట్ల రూపాయల వరకూ వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు రావడంతో ఐటీ దాడులకు పాల్పడింది.
ఇక సుకుమార్(Sukumar) సైతం ఇటీవలి కాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ వస్తున్నారు. ఆయన కూడా ఐటీ పన్నులు సరిగా చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుక్కు(Sukumar) నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులకు దిగింది. కాగా.. మైత్రీ (Mythri Movie Makers) సంస్థపై గతంలో కూడా ఐటీ దాడులు(IT Raids) నిర్వహించింది. గతంలో కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు ఏకకాలంలో 15చోట్ల రైడ్స్ చేపట్టారు. కాగా.. మైత్రీ సంస్థ యజమానులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ గతంలో ఐటీ దాడులు నిర్వహించింది.
మైత్రీ బ్యానర్(Mythri Movie Makers)లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya), ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపుల విషయంలో తేడాలు వచ్చినట్టు తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’(Srimanthudu) సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘జనతా గ్యారేజ్’(Janatha Garage), ‘రంగస్థలం’(Rangasthalam) సినిమాలు సైతం తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నాయి. గతేడాది ‘పుష్ప’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక రంగస్థలం, పుష్ప సినిమాలకు సుక్కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.