Samantha: శాకుంతలం ఫ్లాప్‌తో వేదాంతం వల్లిస్తున్న సామ్..

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది. విడాకుల తర్వాత అమ్మడు సోషల్ మీడియాను ఎంతగా వాడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ముద్దుగుమ్మ మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సోషల్ మీడియాకు కొంత గ్యాప్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ కొంత హర్ట్ అయ్యారు. ట్రోల్స్ వస్తే వాడిని ఖండించుకుంటూ.. ప్రశంలొస్తే వాటిని తీసుకుంటూ.. సరదాగా ఉండే సామ్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిందంటే అయ్యో అనుకున్నారంతా.

మయోసైటిస్ నుంచి కోలుకున్నాక సామ్ ఈజ్ బ్యాక్. తన పోస్టులతో తిరిగి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇది కాసేపు పక్కనబెడితే అమ్మడు ఎందుకో గానీ ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే ఎంచుకుంటోంది. అయితే అమ్మడితో నటించేందుకు స్టార్ హీరోలెవరూ ముందుకు రావడం లేదన్న టాక్ కూడా బీభత్సంగానే నడుస్తోంది. అక్కినేని ట్యాగ్ లైన్ అమ్మడికి ఇంకా అంటుకుని ఉండటమే కారణమట. అందుకే ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

Shaakuntalam Review and Rating

ఇక తాజాగా రిలీజైన శాకుంతలం(Shaakuntalam) మూవీ అమ్మడికి తీరని నిరాశను మిగిల్చింది. దీంతో బీభత్సంగా సామ్‌(Samantha)పై ట్రోల్స్ వచ్చాయి. ఆమె ఆసక్తిగా చేసినట్టు అనిపించలేదని.. డబ్బింగ్ కూడా ఏదో ఇబ్బందిగా చెప్పిందని.. ఆ సినిమా ఫ్లాప్ పాపమంతా సామ్‌పైనే నెట్టేశారు కొందరు నెటిజన్లు. దీనికి తాజాగా భగవద్గీతలోని ఒక శ్లోకంతో సామ్(Samantha) సమాధానమిచ్చింది. ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి’ అని చెప్పుకొచ్చింది. అంటే పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఫలితం మన చేతుల్లో లేదన్నట్టుగా చెప్పేసింది. మొత్తానికి శాకుంతలం (Shaakuntalam) మూవీతో సామ్‌(Samantha)కు వేదాంతం తన్నుకు వచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

Google News