Mogulayya: ‘బలగం’ మొగిలయ్యకు మెగాస్టార్ సాయం..

Chiranjeevi helps balagam singer mogulayya

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. తానే ఒక పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌గా మారిన వ్యక్తి. సినీ ఇండస్ట్రీలోనే శిఖరం వంటి వారు. ఎందరో అప్ కమింగ్ నటీనటులందరికీ ఆయనో ఇన్‌స్పిరేషన్. ఆయన ఒక్క సినిమాల విషయంలోనే కాకుండా మంచి పనులు, సేవా కార్యక్రమాల్లో చిరు ఎప్పుడూ ముందుంటారు. ఇండస్ట్రీలో కానీ.. బయట ఏదైనా ప్రకృతి విపత్తు కానీ వచ్చినప్పుడు సాయం చేయడంలో ఆయనే ఎప్పుడూ తక్షణం స్పందిస్తూ ఉంటారు.

ఇక ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే ఆర్థికంగా అవసరమైతే డబ్బు రూపంలో.. లేదంటే మానసిక ఇబ్బందుల్లో ఉంటే మాటల రూపంలోనో తన ఉదారతచు చిరు చాటుతూ ఉంటారు. తాజాగా బలగం సింగర్ మొగిలయ్య(Mogulayya) కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ వీడియో ద్వారా వేడుకున్నారు.

 ఇక మొగిలయ్య(Mogulayya) అనారోగ్యం గురించి తెలుసుకున్న చిరు వెంటనే స్పందించినట్టు సమాచారం. బలగం డైరెక్టర్ వేణుకు ఫోన్ చేసి మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని చెప్పినట్టు సమాచారం. ఆ తరువాత మొగిలయ్యకు కాల్ చేసి మాట్లాడారట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో మొగిలయ్య(Mogulayya) భార్య వెల్లడించడంతో బయటకు తెలిసింది. ఇటీవల విలన్ పొన్నాంబళం విషయంలో కూడా చిరు సాయమందించారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో పొన్నాంబళం వెల్లడించారు. చిరు చేసిన సాయం జీవితంలో మర్చిపోలేనని తెలిపారు.

Google News