Krithi Shetty: ‘ఉప్పెన’లా ఎగిసి పడిపోయిన కృతి శెట్టి.. కారణం ఆమేనట..
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఉవ్వెత్తున ఎగిసి టప్పున పడిపోతుంటారు. వారిలో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత చేసిన సినిమాలు సైతం మంచి సక్సెస్ సాధించడంతో అమ్మడికి ఇక తిరుగులేదనే భావించారంతా. మంచి కథలను ఎంచుకుంటే అమ్మడి గ్రాఫ్ ఎక్కడో ఉండేది. కానీ కథలో దమ్ము లేక వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిపోయి.. దఢేలున పడిపోయింది.
ఉప్పెన(Uppena), శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy), బంగార్రాజు(Bangarraju) వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్‌తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టికి ఆ తరువాత కాలం కలిసి రాలేదు. హ్యాట్రిక్ పరాయజయాలను సైతం అందుకుంది. వారియర్, మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సినిమాలు వరుసగా అమ్మడికి నిరాశనే మిగిల్చాయి. ఎంత గ్లామర్ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? వరుసబెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతుంటే ఇక కెరీర్ ఏముంటుంది? దర్శక నిర్మాతలెవరూ కృతి శెట్టి(Krithi Shetty) వైపు కూడా చూడటం లేదని టాక్.
తోటి కుర్ర హీరోయిన్లతో పోటీ పడలేక రేసులో వెనుకబడిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) ఇప్పుడు అవకాశాల కోసం తన రెమ్యూనరేషన్‌ను కూడా భారీగానే తగ్గించుకుందని సమాచారం. అయినా కూడా అవకాశాలు రావడం లేదట. దీనిపై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కృతి(Krithi Shetty) కెరీర్ నాశనమవడానికి ఆమె తల్లి కూడా ఒక కారణమేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కృతి శెట్టి(Krithi Shetty) కథలను ఆమె తల్లి నీతి శెట్టి చూస్తుందట. ఆమెకు నచ్చితేనే సినిమా. ఇది కృతి బీభత్సంగా దెబ్బ కొట్టింది. నీతి శెట్టి చాలా సినిమాలను రిజెక్ట్ చేశారట. వాటిలో సూపర్ సక్సెస్ అయిన సినిమాలు కూడా ఉన్నాయని టాక్. మొత్తానికి కృతి(Krithi Shetty) ఎదుగుదలకు ఆమె తల్లే గండికొడుతోందని సమాచారం.