సిల్క్ స్మిత మరణంపై జయమాలిని ఏం చెప్పారంటే..

సిల్క్ స్మిత మరణంపై జయమాలిని ఏం చెప్పారంటే..

కొన్ని సార్లు ఆత్మహత్యలకు కారణం.. క్షణికావేశం అవుతుందేమో కానీ అన్ని సార్లూ కాదు. ఎంతో మనోవేదన.. కనీసం మాట సాయం చేసే దిక్కు కూడా లేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. శృంగార తార సిల్క్ స్మిత కూడా అప్పట్లో బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. 35 ఏళ్ల వయసులోనే ఆమె తనువు చాలించింది. అసలు ఆమె మరణం వెనుకున్న కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.

అయితే తాజాగా సిల్క్ స్మిత మరణంపై జయమాలిని స్పందించారు. అప్పట్లో సిల్క్ స్మితతో కలిసి కొన్ని సినిమాల్లో జయమాలిని నటించారు. అయితే షూటింగ్ స్పాట్‌లో స్మిత అసలు తనతో మాట్లాడేదే కాదని జయమాలిని చెప్పుకొచ్చారు. అతి తక్కువ కాలంలో పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా విపరీతంగా స్మిత సంపాదించిందని తెలిపారు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు.

Advertisement
సిల్క్ స్మిత మరణంపై జయమాలిని ఏం చెప్పారంటే..

ప్రేమించడం అయితే తప్పు కాదు కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదని..  అయితే ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసి తల్లిదండ్రులను విడిచిపెట్టిందని జయమాలిని తెలిపారు. అతను మోసగించిన తరుణంలో ఆమెతో తల్లిదండ్రులుంటే ఇబ్బంది ఉండేది కాదని.. కాస్త వారు మోరల్ సపోర్టుగా నిలిచేవారని తెలిపారు. పైగా పక్కన సొంతవాళ్లు లేకుంటే చాలా మంది ఇలాగే మోసం చేస్తూ ఉంటారని వెల్లడించారు.