వామ్మో.. రెమ్యూనరేషన్స్ విషయంలో సమంత తగ్గట్లేదుగా..!

వామ్మో.. రెమ్యూనరేషన్స్ విషయంలో సమంత తగ్గట్లేదుగా..!

మయోసైటిస్ వ్యాధి నుంచి స్టార్ హీరోయిన్ సమంత పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం జనాలకు మయోసైటిస్ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే యాడ్స్‌లో కూడా నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. ఆమె చికిత్సకు వెళ్లడానికి ముందు నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటి వరకూ సామ్ సినిమాల జోలికి అయితే వెళ్లలేదు. కానీ త్వరలోనే సినిమాలకు సైన్ చేయనుందట.

ఈ క్రమంలోనే సమంత గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తన రెమ్యూనరేషన్‌ను సమంత డబుల్ చేసిందట. గతంలో ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకూ డిమాండ్ చేసిన సమంత.. ఇప్పుడు ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేస్తోందట. అలాగే యాడ్స్ విషయానికి వస్తే.. ఒక్కో దానికి రూ.1.5 కోట్లు పారితోషికం అందుకుంటోందట. వెబ్ సిరీస్‌ల రెమ్యూనరేషన్ గురించి మాత్రం షాకింగ్ విషయమే వినిపిస్తోంది.

Advertisement
వామ్మో.. రెమ్యూనరేషన్స్ విషయంలో సమంత తగ్గట్లేదుగా..!

వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటించి సంచలనం రేపింది. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించింది. ఇదే నాగ చైతన్యతో విడాకులకు కారణమనే టాక్ కూడా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ – డీకేనే సిటాడెల్‌ను రూపొందించారు. దీనిలో సామ్ లీడ్ రోల్ పోషించింది. ఈ వెబ్ సిరీస్‌కు మాత్రం రూ.10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్.