కూతురితో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్

కూతురితో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్క్ పట్ల ఎంతైతే డెడికేషన్‌తో ఉంటాడో ఫ్యామిలీ విషయంలోనూ అంతే డెడికేషన్‌తో ఉంటాడు. ఈ విషయం పలుమార్లు రుజువైంది కూడా. ఇక చెర్రీ సతీమణి ఉపాసనకు ఫ్రీం టైం దొరికిందంటే భర్తతో కలిసి షూటింగ్ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. షూటింగ్ ముగిసిన వెంటనే ఫ్యామిలీతో కలిసి చెర్రీ ఎంజాయ్ చేస్తుంటాడు. పాప పుట్టిన తర్వాత చెర్రీ ఎక్కువగా ఫ్యామిలీతోనే షూటింగ్ ప్రాంతానికి వెళుతున్నాడు.

ప్రస్తుతం చెర్రీ.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. చెర్రీ సినిమా షూటింగ్ నిమిత్తం వైజాగ్ వచ్చాడని తెలుసుకున్న అక్కడి జనం ఆయన్ను చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఇక వైజాగ్‌కు చెర్రీ ఉపాసన, కూతురు క్లీంకారతో పాటు డాగ్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. షూటింగ్ ముగిసిన వెంటనే బీచ్‌లో వారితో ఎంజాయ్ చేస్తున్నాడు.

Advertisement
కూతురితో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్

వైజాగ్ బీచ్‌లో క్లీంకారతో ఆడుకుంటూ ఎంజాయ్ చేసిన వీడియోస్‌ను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అటు సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటూనే ఇటు ఫ్యామిలీతో చెర్రీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేసుకుని బుచ్చిబాబు సానతో మూవీని లైన్‌లో పెట్టాలనే యోచనలో ఉన్నాడు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు టాక్.