పెళ్లికూతురిలా తమన్నా.. పెళ్లెప్పుడంటున్న నెటిజన్లు..

పెళ్లికూతురిలా తమన్నా.. పెళ్లెప్పుడంటున్న నెటిజన్లు..

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నాయి. అమ్మడి వయసు కూడా 35 ఏళ్లు దాటాయి. అయినా సరే అమ్మడు అందానికి ఐకాన్‌లా ఉంటుంది. అన్నం తింటుందో.. అందం తింటుందో అర్థం కాని పరిస్థితి. అందుకే తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. 36 ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లి గురించి ఆలోచించకుండా కుకరీ షోస్ చేసుకుంటోంది.

పెళ్లికూతురిలా తమన్నా.. పెళ్లెప్పుడంటున్న నెటిజన్లు..

ఇటీవల జైలర్ సినిమాలో నటించింది తమన్నా. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మిల్కీ బ్యూటీ పెళ్లెప్పుడనేది మాత్రం తెలియడం లేదు. ఇటీవలి కాలంలో ఆమె ఎక్కడ కనిపించినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నే ఎదురవుతోంది. ప్రస్తుతానికి అరణ్మణై 4 అనే చిత్రంలో మిల్కీ బ్యూటీ నటిస్తోంది. ఇది తప్ప అమ్మడి చేతిలో మరో ప్రాజెక్ట్ అయితే లేదు. అయితే హిందీలో అవకాశాలు వరిస్తున్నాయట.

పెళ్లికూతురిలా తమన్నా.. పెళ్లెప్పుడంటున్న నెటిజన్లు..

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా బాలీవుడ్‌ నటుడు, నిర్మాత విజయ్‌వర్మతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న విషయం తెలిసిందే. అమ్మడు విజయ్ వర్మతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉంది. అయినా సరే పెళ్లి మాటే ఎత్తదు. తాజాగా పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను ఆయన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమన్నా ఆ పిక్స్‌లో పెళ్లి కూతురులా చాలా అందంగా ఉండంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లెప్పుడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Google News