SSMB29: మహేష్‌తో తీయబోయే సినిమాకు రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

SSMB29: మహేష్‌తో తీయబోయే సినిమాకు రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

రాజమౌళి సినిమా అంటేనే ప్రతిదీ హాట్ టాపికే. ఏ చిన్న న్యూస్ వచ్చినా తెగ వైరల్ అయిపోతూ ఉంటుంది. రాజమౌళి మూవీ టేకింగ్ ఆ రేంజ్‌లో ఉంటుంది. ప్రేక్షకుడిని ఊహల ఉయ్యాలలో ఊరేగిస్తూ ఉంటారు. ఇక ఆయన సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో సినిమా తీయబోతున్నారన్న దగ్గర నుంచి ఏ అప్‌డేట్ వస్తుందా? అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రాజమౌళి రెమ్యూనరేషన్. ఇంత భారీ బడ్జెట్ సినిమాకు రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి ఈ ప్రాజెక్టుకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.

సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం. రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఇటీవలి కాలంలో వెయ్యి కోట్లకు తగ్గడం లేదు. మరి ఈ సినిమా బడ్జెట్టే రూ.1000 కోట్లంటే రెమ్యూనరేషన్ ఇంకెన్ని కోట్లు ఉంటుందో ఊహించలేం. ఇక మహేష్ కూడా ఈ సినిమా కోసం పెద్ద మొత్తమే అందుకుంటున్నాడట. అంటే కేవలం రెమ్యునరేషన్‌తో సరిపెట్టుకోకుండా సినిమాకు వచ్చే లాభాల్లో సైతం మహేష్ కొంత వాటా తీసుకోనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి.

Google News