‘లాహిరి లాహిరి లాహిరిలో’ హీరో మద్యానికి బానిసై డిప్రెషన్‌లోకి వెళ్లాడట.. తర్వాత ఏం జరిగిందంటే..

Lahiri Lahiri Lahirilo telugu movie

‘లాహిరి లాహిరి లాహిరిలో’ (Lahiri Lahiri Lahirilo) మూవీ గుర్తుందా? ఈ సినిమా ఒక మంచి సక్సెస్ సాధించింది. ఫన్‌కి ఫన్‌తో పాటు ఫ్యాక్షన్‌ను జోడించి మరీ వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమా ద్వారానే ఆదిత్య ఓం (Aditya Om) అనే హీరో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. అల్లరి అల్లరి చేసే ఇతడి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. హరి కృష్ణ, సుమన్, వినీత్ లతో పాటు ఆదిత్య (Aditya Om) ప్రధాన పాత్ర చేశారు. కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. అంతే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇక ఈ సినిమాతోనే ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన ఆదిత్య (Aditya Om)కు బాగానే ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో పాతిక చిత్రాల వరకూ చేశాడు కానీ ఏం ప్రయోజనం… వరుస ఆఫర్లతో పాటే వరుస పరాజయాలు కూడా వెంటాడాయి. ఇక అంతే.. కానీ పరాజయాలు ఆయన్ని వెంటాడాయి. దీంతో అవకాశాలు రాక ఒక్కసారిగా వెండితెరకు దూరమయ్యాడు. ఇక ఆ వెంటనే బాధను భరించలేక తాగుడికి బానిసవడం.. ఆపై డిప్రెషన్‌కు గురవడం వెంటవెంటనే జరిగిపోయాయని ఆదిత్య ఓం (Aditya Om) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Actor Aditya Om

తనను కొందరైతే ఏకంగా మీరు బతికే ఉన్నారా? అని కూడా అడిగారని ఆదిత్య ఓం వెల్లడించాడు. తాను ఈ డిప్రెషన్ నుంచి కుటుంబ సభ్యుల సాయంతోనే బయటపడగలిగానని తెలిపాడు. తానొక చైన్ స్మోకర్ అని.. రోజుకు 60 సిగరెట్లు తాగేవాడినని ఆదిత్య ఓం (Aditya Om) తెలిపాడు. ఒక ఫైన్ మార్నింగ్ ఇకపై స్మోకింగ్ జోలికి వెళ్లకూడదని, మద్యం తాగవద్దని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. అదే మాటకు కట్టుబడి ఉన్నాడట. 46 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం అదేనని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆదిత్య (Aditya Om) ‘దహనం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Google News