IPL 2023 Opening Ceremony: ఐపీఎల్‌లో ఇరగదీసిన రష్మిక, తమన్నా.. అబ్బో చూడటానికి రెండు కళ్ళు చాలవ్!

Tamannah, Rashmika Mandanna at IPL 2023 opening ceremony

ఐపీఎల్ (IPL 2023) నిన్న గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. లాంచింగ్ ఈవెంట్‌లో తారల సందడి హైలైట్‌గా నిలిచింది. రష్మిక మందాన (Rashmika Mandanna), తమన్నా(Tamannah)తో పాటు పలువురు అలరించినా కూడా తమన్నా మాత్రం ప్రోగ్రాంనంతటినీ క్లీన్ స్పీప్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. టైట్ ఫిట్‌తో శరీర వంపు, సొంపులన్నీ చూపిస్తూ మెస్మరైజ్ చేసేసింది. ఎనిమీ చిత్రంలోని ‘టమ్ టమ్’ సాంగ్‌కి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక తమన్నా (Tamannah) డ్రెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Tamannah at IPL 2023 opening ceremony

ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో తమన్నా పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిల్కీ బ్యూటీ ఇప్పుడు ఫుల్ బిజీ అయినా కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రజినీకాంత్‌తో ఒక మూవీలో నటిస్తోంది. మరో సినిమా భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు పెద్ద హీరోల సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

Advertisement
Tamannah at IPL 2023 opening ceremony

టాలీవుడ్‌లో అమ్మడి ప్రస్థానం ఇప్పటిది కాదు.. రెండు దశాబ్దాలు అవుతోంది. ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో నిలవడమంటే మామూలు విషయం కాదు. అది దాదాపు మిల్కీ బ్యూటీకే సాధ్యమైందని చెప్పాలి. తమిళ్ హిట్ మూవీ వేదాళానికి రీమేకే భోళా శంకర్. గతంలో తమన్నా సైరా మూవీలో చిరంజీవికి జంటగా నటించింది. ఇప్పుడు చిరు సరసన రెండో సినిమా చేస్తోంది. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది.