Manchu Vishnu: గొడవంతా ఉత్తుత్తే అంటున్న మంచు విష్ణు.. లక్ష్మీ, మనోజ్‌లు ఏమంటున్నారంటే..

Manchu Vishnu

మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన గొడవ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం డ్యామేజ్ కంట్రోల్‌కు యత్నిస్తుండగా.. మనోజ్, మంచు లక్ష్మి (Manchu Lakshmi)ల దారి మరోలా ఉంది. మొత్తానికి విష్ణుతో లక్ష్మి, మనోజ్‌ (Manchu Manoj)లకు చెడిందని మాత్రం అర్ధమవుతోంది. కొన్ని నెలలుగా విష్ణు-మనోజ్ (Manchu Vishnu-Manoj) మధ్య దూరం పెరిగిందని.. గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.

Manchu Manoj, Manchu Vishnu

ఈ నేపథ్యంలో మనోజ్(Manchu Manoj) ఓ వీడియో విడుదల చేశాడు. విష్ణు తన బంధువులు సన్నిహితులతో గొడవలు పడుతున్నాడు చూడండి.. ఇదీ వరస అని తెలిపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలోనే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య గొడవలు నిజమేననడానికి ఆ వీడియో రుజువుగా మారింది. అయితే ఇదంతా ఓ రియాలిటీ షోలో భాగంగా జరిగిందని.. ఇదొక ప్రాంక్ అని.. ‘హౌస్ ఆఫ్ మంచూస్’ టైటిల్ తో ప్రోమో కూడా విడుదల చేశారు.

Manchu Lakshmi talks about Vishnu, Manoj issue

మొత్తానికి విష్ణు తమ మధ్య గొడవల్లేవని విష్ణు జనాలను నమ్మించే యత్నం చేశాడు. దీనిపై మంచు లక్ష్మి (Manchu Lakshmi) మట్లాడుతూ.. అసలు ఈ రియాలిటీ షో గురించి తనకు తెలియదని.. తమకు సంబంధమే లేదని చెప్పిందట. ఇక మనోజ్ మాత్రం గొడవ జరిగిన మాట వాస్తవమేనని కుండ బద్దలు కొట్టాడట. ఈ విషయాన్ని సారథి భార్య మనోజ్‌కి ఫోన్ చేస్తే అతను సారధి వాళ్ల ఇంటికి వెళ్లాడని మనోజ్ టీమ్ వెల్లడించిందని సమాచారం.

Google News