Rana Naidu: ‘రానా నాయుడు’ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న నెట్‌ఫ్లిక్స్..
కరోనా సమయం నుంచి జనం దాదాపుగా థియేటర్లకు వెళ్లడం తగ్గించేసి ఓటీటీలపైనే దృష్టి సారించారు. దీంతో ఓటీటీల సంఖ్య బాగా పెరిగింది. వెబ్ సిరీస్‌ల పేరిట అడల్ట్ కంటెంట్ పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా అవి లేవంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక నెట్‌ఫ్లిక్స్(Netflix)లో ఇటీవల స్ట్రీమింగ్ అయన వెబ్ సిరీస్.. రానా నాయుడు (Rana Naidu). బాబాయ్.. అబ్బాయిలు.. విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటించారు.
ఈ సిరీస్ విడుదలకు ముందే వెంకీ.. దీనిని సింగిల్‌గా చూడమని హింట్ ఇచ్చారు. కానీ ఎందుకు చెప్పారనే విషయం మాత్రం వెబ్ సిరీస్ చూశాకే అర్ధమైంది. బూతులు బీభత్సంగా ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ కూడా భారీగానే ఉంది. వెంకీ, రానాల కాంబో అనగానే ఎంతో ఆసక్తిగా తిలకించిన ప్రేక్షకులకు పెద్ద షాకే తగిలింది. ఈ సిరీస్ అడల్ట్ కంటెంట్ కారణంగా ఒకవైపు క్రేజ్, మరోవైపు విమర్శలను ఏకకాలంలో అందుకుంది.
వీటన్నింటి కారణంగా రానా నాయుడు(Rana Naidu) విషయమై నెట్‌ఫ్లిక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ఆడియోలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌లో పెద్ద మొత్తంలో అడల్ట్ కంటెంట్ ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇది చూసేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం రానా 12 కోట్లు, రానా రూ.8 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.