Rahul Sipligunj: ‘నాటు నాటు’ సాంగ్‌కు రాహుల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే..
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. ఇక ఏకంగా ఆస్కార్ (Oscar) వేదికపై పాడాలంటే కాస్తంత కాదు.. బీభత్సంగా అదృష్టం ఉండాలి. ఇది లెజెండ్స్‌కి సైతం దక్కని అవకాశం. కలలోనైన తెలుగు సింగర్స్ ఊహించని అపురూపమైన వరం. అలాంటి వరం రాహుల్ సిప్లింగంజ్(Rahul Sipligunj) సొంతమైంది. ఈ సందర్భంగా రాహుల్‌కి సంబంధించి ఎన్నో విషయాలు హైలైట్ అవుతున్నాయి. అతని ఫస్ట్ రెమ్యూనరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ సినిమా వేదిక మీద నాటు నాటు సాంగ్ పాడి ఒక చరిత్ర సృష్టించిన రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) జర్నీ అసలు ఎలా మొదలైంది. ఆయన ఫస్ట్ సాంగ్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలుత రాహుల్ తన ప్రయోగమంతా ఇంట్లోని వంట పాత్రలపైనే చేసేవాడట. వాటిపై వాయిస్తూ పాటలు పాడేవాడట. కొడుకులోని టాలెంట్‌ను గుర్తించిన తండ్రి మ్యూజిన్ నేర్పించాలనుకున్నారట. అంతకు ముందు రాహుల్(Rahul Sipligunj) వాళ్ల తాతయ్య కూడా గజల్ సింగర్ కావడంతో అదే మనోడికి వారసత్వంగా వచ్చింది.
రాహుల్ తన తొలి పాటకు రూ.500 రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. తర్వాత ‘నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి’ చిత్రంలో ఒక పాట.. ఆపై జోష్ చిత్రంలో ‘కాలేజీ బుల్లోడా’ సాంగ్ పాడాడు. ఇక అక్కడి నుంచి కీరవాణి (Keeravani) వద్దకు చేరాడట. తొలినాళ్లలో కీరవాణి టీమ్‌లో కోరస్ పాడటం, ట్రాక్స్ పాడటం వంటివి చేశాడట. కీరవాణి తనను ఎంతగానో ప్రోత్సహించారని రాహుల్ తెలిపాడు. ఇక ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu)కు రాహుల్ రూ.3 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇక ఆ పాటకు రాహుల్ దక్కించుకున్న గౌరవం మాత్రం కోట్లు కుమ్మరించినా కూడా దక్కడం కష్టమే.