Dasara: దసరా.. టైటిల్లో ఉన్నంత పండగ.. సినిమాలో లేదా.. వామ్మో ఇదెక్కడి రివ్యూరా బాబోయ్..!
దసరా మూవీ (Dasara Movie) బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ వినిపించకున్నా కూడా డిజాస్టర్ టాక్ అయితే లేదు. రివ్యూస్ కొన్ని దారుణంగానూ.. కొన్ని పర్వాలేదన్నట్టుగా.. కొన్ని బాగుందన్నట్టుగా.. ఎవరికి తోచింది వారిచ్చేశారు. మరి ఒక సామాన్యుడు రివ్యూ ఇస్తే ఎలా ఉంటుందన్న టాక్ అయితే ఒకటి మనకు వస్తుంది కదా. ట్విటర్‌లో ఒక రివ్యూ కనిపిస్తోంది. అది చూస్తే ఇదెక్కడి రివ్యూరా బాబోయ్ అనిపించక మానదు. సినిమా సారాన్ని కాచి వడపోసిన రివ్యూ అది.
నాని నటించిన దసరా సినిమా (Dasara Movie) అట్టర్ ఫ్లాప్ అని రివ్యూ ఇచ్చిన నెటిజన్.. 2014లో వచ్చిన గుండె (Gunday) సినిమాను కాపీ కొట్టి తీశారని వెల్లడించాడు. కథనం ఆసాంతం ఎక్కడో చూసామన్న భావన అయితే కలగక మానదని తెలిపాడు. సినిమా చూస్తున్నంత సేపూ డెజావు భావన కలుగుతుందట. అంటే ప్రతి సీన్ ఎక్కడో చూశామన్న ఫీలింగ్. ఎన్నో సినిమాల స్ఫూర్తే ‘దసరా’(Dasara) మూవీ అని తేల్చి చెప్పాడు. ‘రంగస్థలం’ మాదిరిగా కథనాన్ని నడపలనే ప్రయత్నం.. ‘పుష్ప’ (Pushpa) మాండలికం.. ‘కాంతారా’ (Kanthara) క్లైమాక్స్.. అంతేకాకుండా మగధీరలో మాదిరిగా వందమందిని నరుక్కుంటూ పోయే వైనం.. ‘లగాన్’(Lagaan) క్రికెట్ టీం ని గుర్తు తెచ్చే హీరో బలగం ఇన్ని ఉన్నాయట దసరాలో.
ఇక ఎండింగ్ సీన్‌లో ‘రుద్రవీణ’ (Rudraveena) స్ఫూర్తితో ఒక బిట్ ఉంటుందట. మొత్తానికి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఎన్నీ సినిమాల సీన్స్‌ను కలిపితే దసరా (Dasara) అని తేల్చేశాడు. ఇక ఇందులోని మెయిన్ ట్రాక్ వచ్చేసి సిద్ధార్థ్, శర్వానంద్‌లతో తీసిన మహా సముద్రం మూవీని తలపిస్తుందట. హిట్, ఫ్లాప్‌లు దేన్నీ వదలకుండా దర్శకుడు మూవీని తెరకెక్కించారని తేల్చేశాడు. ఇదొక రివెంజ్ డ్రామా అని.. మొత్తానికి టైటిల్లో ఉన్నంత పండగ ఫీలింగ్ అయితే కలగదని సదరు నెటిజన్ అభిప్రాయం. అసలు ట్రాక్‌లతో సహా చెప్పాడంటే ఆ నెటిజన్ ఒక అద్భుతమైన క్రిటిక్ అనే చెప్పాలి.
ఇవీ చదవండి:
Dasara Review & Ratings: దసరా మూవీ రివ్యూ & రేటింగ్
Nani: వామ్మో.. ‘దసరా’కు నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..
Dasara 1st Day Collections: తొలిరోజున ‘దసరా’కు కలెక్షన్స్ సునామీ.. ఎన్ని కోట్లు కొట్టిందంటే..!