రీ-రిలీజ్ లో కూడా ట్రిమ్మింగ్
ఫ్లాప్ టాక్ వస్తే ట్రిమ్ చేయడం సహజం. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు-2 సినిమాకు కూడా అదే చేశారు. అక్షరాలా 12 నిమిషాలు ట్రిమ్ చేశారు. అయినా సినిమా లేవలేకపోయింది. అది వేరే విషయం. అయితే రీ-రిలీజ్ సినిమాకి కూడా ట్రిమ్ చేస్తే ఎలా ఉంటుంది?
టాలీవుడ్ హిస్టరీలోనే తొలిసారి రీ-రిలీజ్ అవుతున్న ఓ సినిమాకు ట్రిమ్ చేస్తున్నారు. అదే మురారి. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. అయితే భారీ నిడివి కారణంగా అప్పట్లో సినిమా ఫ్లాప్ అయింది.
మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈసారి మాత్రం మేకర్స్ జాగ్రత్త పడ్డారు. 18 నిమిషాలు రన్ టైమ్ తగ్గించి రీ-రిలీజ్ చేస్తున్నారు. రీ-రిలీజ్ లో దీని నిడివి 2 గంటల 42 నిమిషాలు.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమాలో మహేష్ బాబు నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇక మహేష్-సోనాలీ పెయిర్ అయితే సూపర్ హిట్టయింది. ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడీ సినిమా ట్రిమ్ వెర్షన్ ను 4కె రిజల్యూషన్ లో మరోసారి వెండితెరపై చూడొచ్చు.