రామ్ వర్సెస్ రవితేజ… గెలుపెవరిది?

రామ్ వర్సెస్ రవితేజ… గెలుపెవరిది?

బాక్సాఫీస్ బరిలో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఆగస్ట్ 15న రామ్, రవితేజ పోటీపడబోతున్నారు. రామ్ నటిస్తున్న “డబుల్ ఇస్మార్ట్” సినిమా విడుదల తేదీని ఇదివరకే ప్రకటించారు. ఆగస్ట్ 15న రాబోతున్నట్టు తెలిపారు.

తాజాగా రవితేజ నటిస్తున్న “మిస్టర్ బచ్చన్” సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమాను కూడా 15కే విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో రామ్-రవితేజ మధ్య బాక్సాఫీస్ వార్ అధికారికమైంది.

ఈసారి వీళ్లలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం గతంలో వీళ్లిద్దరూ పోటీపడ్డమే. గతంలో ఓ సందర్భంలో రామ్ నటించిన “రెడ్” సినిమా, రవితేజ నటించిన “క్రాక్” సినిమాలు ఒకే టైమ్ లో రిలీజయ్యాయి. వీటిలో “రెడ్” సినిమా ఫ్లాప్ అవ్వగా, “క్రాక్” సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

రవితేజ కి బ్యాడ్ సెంటిమెంట్

ఐతే ఇండిపెండెన్స్ డే (ఆగస్ట్ 15) రవితేజకి ఇంతకుముందు కలిసిరాలేదు. గతంలో “దేవుడు చేసిన మనుషులు”, “ఆంజనేయులు”చిత్రాలు ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా విడుదల అయ్యాయి. పూరి తీసిన “దేవుడు చేసిన మనుషులు” దారుణ పరాజయం పాలు అయింది. ఆ సినిమా ఒక్క రోజు కూడా ఆడలేదు. “ఆంజనేయులు” మరీ ఫ్లాప్ కాదు కానీ అది కూడా పెద్దగా ఆడలేదు. మరి ఈసారి సెంటిమెంట్ రివర్స్ అవుతుందా?

Google News