మేడమ్ టుస్సాడ్స్ లోకి రామ్ చరణ్

మేడమ్ టుస్సాడ్స్ లోకి రామ్ చరణ్

రామ్ చరణ్ మరో అరుదైన ఘనతకు దగ్గరగా ఉన్నాడా? అవుననే అంటున్నారు చాలామంది. త్వరలోనే అతడి మైనపు విగ్రహం లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరబోతోందంట. దీనికి సంబంధించి తన శరీర కొలతలు ఇవ్వడానికి, చరణ్ ప్రత్యేకంగా లండన్ వెళ్లబోతున్నాడని టాక్.

టాలీవుడ్ హీరోలకు మైనపు విగ్రహాలు కొత్త కాదు. మేడమ్ టుస్సాడ్స్ బ్యాంకాక్ బ్రాంచ్ లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. సింగపూర్ బ్రాంచ్ లో మహేష్ విగ్రహాన్ని, దుబాయ్ బ్రాంచ్ లో బన్నీ విగ్రహాల్ని పెట్టారు.

అయితే మెయిన్ బ్రాంచ్ అయిన లండన్ లో రామ్ చరణ్ విగ్రహాన్ని పెట్టబోతున్నారనేది తాజా ఊహాగానం. దీనిపై మెగా కాంపౌండ్ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇండియాకు చెందిన అమితాబ్, షారూక్, శ్రీదేవి లాంటి స్టార్స్ మైనపు విగ్రహాలన్నీ లండన్ బ్రాంచ్ లోనే ఉన్నాయి. తాజా గాసిప్స్ నిజమైతే, వాటి సరసన చరణ్ మైనపు ప్రతిమ కూడా చేరుతుంది.

Google News