బిడ్డకు జన్మనిచ్చిన ‘హీరామండి’ సుందరి

బిడ్డకు జన్మనిచ్చిన 'హీరామండి' సుందరి

హీరోయిన్ రిచా చద్దా తల్లయింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పాప పుట్టి 2 రోజులైంది. కాకపోతే తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది.

కొన్ని రోజుల కిందట తన ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ స్టిల్స్ ను షేర్ చేసింది రిచా చద్దా. త్వరలోనే తమ జీవితాల్లోకి ఓ కాంతిపుంజం వస్తోందంటూ పోస్టు పెట్టింది. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని ప్రకటించింది.

నటుడు అలీ ఫజల్ తో 2015 నుంచి డేటింగ్ చేసింది రిచా చద్దా. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు కూడా చేశారు. అలా ఐదేళ్లు ప్రేమించుకొని 2020లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత స్నేహితులు, బంధువులకు పార్టీ ఇచ్చారు.

ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చి వైవాహిక బంధంలో మరో అడుగు ముందుకేశారు. రీసెంట్ గా వచ్చిన “హీరామండి” వెబ్ సిరీస్ లో రిచా చద్దా నటించింది. ఇక అలీ ఫజల్ నటించిన “మీర్జాపూర్ సీజన్-3” తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది.

Google News