పెళ్లి ఆలోచన లేదు… షాకిచ్చిన నభా

పెళ్లి ఆలోచన లేదు… షాకిచ్చిన నభా

పెళ్లి గురించి అడిగితే హీరోయిన్లు మెలికలు తిరిగిపోతుంటారు. తనకు కాబోయేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ చాంతాడంత లిస్ట్ చెబుతారు. ఫైనల్ గా ఏ వ్యాపారవేత్తనో పెళ్లి చేసుకుంటారు. అది వేరే విషయం.

హీరోయిన్ నభా నటేష్ కూడా అలాంటి ఓ పెద్ద లిస్ట్ చెబుతుందని అంతా అనుకున్నారు. కానీ నభా చిన్నపాటి షాకిచ్చింది. తనకస్సలు పెళ్లి ఆలోచనల్లేవ్ అంటోంది. తన దగ్గర అలాంటి ప్రశ్నలు అడగొద్దని కూడా సూచిస్తోంది.

“నాకు అస్సలు పెళ్లి ఆలోచనల్లేవు. అలాంటి ప్రశ్నలు అడగకండి. ఒకవేళ దురదృష్టవశాత్తూ పెళ్లి జరిగినా పోయేదేం లేదు. నేను బాగానే ఉంటాను. నాకు లైఫ్ పార్టనర్ గా ఎవరొచ్చినా బాగుంటుంది. స్వతహాగా నేను ఛిల్ గా ఉంటాను. సాధారణంగా కోపం రాదు. కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదు.”

“డార్లింగ్” రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది నభా నటేశ్. ఇది ఆమెకు రీఎంట్రీ మూవీ. ఈ సినిమాపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమాలో ఆమె మల్టీపుల్ పర్సనాలిటీలు ఉన్న పాత్ర పోషించింది.

Google News