పెళ్లి తర్వాత భర్తతో మీడియా ముందుకు కొత్త పెళ్లికూతురు.. వరలక్ష్మి కొత్త స్టెప్పు ఇదే

పెళ్లి తర్వాత భర్తతో మీడియా ముందుకు కొత్త పెళ్లికూతురు.. వరలక్ష్మి కొత్త స్టెప్పు ఇదే

పెళ్లి తర్వాత భర్తతో మీడియా ముందుకుకొత్త పెళ్లికూతురు వరలక్ష్మి కొత్త స్టెప్పు ఇదే” హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్. మీరంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి,” అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్.

తన భర్త నికోలై సచ్‌దేవ్‌ తో కలసి హైదరాబాద్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు వరలక్ష్మి శరత్‌కుమార్.

ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ మనసు విప్పి మాట్లాడారు. “తెలుగు ప్రేక్షకులు, తెలుగు దర్శక, నిర్మాతలు, తెలుగు మీడియా మిత్రులు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఉంటుంది అని ఆశిస్తున్నా,” అని అన్నారు వరలక్ష్మి.

నా భర్తతో కలిసి ఇలా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. పెళ్లి కాగానే చాలామంది హీరోయిన్లు పిల్లలను కనాలనో, భర్తతో ఎక్కువ సమయం గడపాలనో సినిమాలకు దూరం అవుతారు. కానీ వరలక్మికి సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచన లేదు.

“ఇంకా చాలా సినిమాలు చేస్తాను. నిజం చెప్పాలంటే కెరీర్ ఇప్పుడే మొదలుపెట్టాను,” అని స్పష్టం చేసింది.

“మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా వుంది. మై వైఫ్ అమేజింగ్ యాక్ట్రెస్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తనని మ్యారేజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరంతా తనని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఒక ఫ్యామిలీ లా చూసుకున్నారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి. థాంక్ యూ ఆల్,” అన్నారు ఆమె భర్త నికోలై సచ్‌దేవ్‌.

Google News