Manchu Vishnu: మోహన్‌బాబుకి విలువైన గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు ..!

Manchu Vishnu costly gift to Mohan Babu

ఎందుకో గానీ మంచు ఫ్యామిలీ ఏం చేసినా సంచలనమే. మాట్లాడినా.. పోట్లాడినా.. వంట చేసినా.. ఏం చేసినా ఎందుకో సంచలనం అవుతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక విషయంలో మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) పుట్టిన రోజు సందర్భంగా ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాని కాస్ట్ రూ.5 కోట్లకు పైనేనని టాక్. మరి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఏం ఇచ్చాడా? అని అనుకుంటున్నారా?

మార్చి 19న మోహన్ బాబు(Mohan Babu) పుట్టినరోజు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మోహన్‌బాబు పుట్టినరోజు వేడుక చాలా గ్రాండ్‌గా జరిగిందట. ఇక ఈ వేడుకలో విష్ణు(Manchu Vishnu) ఇచ్చిన గిఫ్టే హైలైట్ అని తెలుస్తోంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని మోహన్‌బాబుకు విష్ణు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సమాచారం. అయితే మంచు ఫ్యామిలీ మాత్రం ఈ విషయానికి బయటకు రానివ్వలేదు. ఈ కారు స్పెసిఫికేషన్స్, ఖరీదు గురించి ఎక్కడా మాట్లాడిందైతే లేదు. 

ఇక నెటిజన్లు ఊరుకుంటారా? కారు నేమ్ తెలిసింది చాలు. దాని ధర నుంచి పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు తీశారు. ఈ కస్టమ్ మేడ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ విలువ రూ. 5.25 కోట్లు అని సమాచారం. ఇప్పటికే మోహన్‌బాబు దగ్గర ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్‌లు ఉన్నాయని టాక్. ఈ లిస్ట్‌లో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీ కూడా చేరిపోయింది. మరి ఈ వార్తలో నిజమెంతనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జోరుగానే సాగుతోంది.

Google News