NTR: అంతమంది స్టార్ హీరోల మధ్య ఎన్టీఆర్ సమ్‌థింగ్ స్పెషల్.. కారణాలు ఏంటంటే..

NTR

సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR)కు ఉండే క్రేజే వేరు. పాన్ ఇండియాకు ఇప్పుడంటే వెళ్లాడు కానీ ఆ రేంజ్ గౌరవం యంగ్ టైగర్‌కు ఎప్పుడో దక్కింది. దానికి కారణం.. క డైలాగ్ డెలివరీ విషయంలో తాత సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మనోడే. వీరి తర్వాతే ఇండస్ట్రీలో ఎవరైనా. ఇక తారక్ డ్యాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడు. ఎంత కష్టమైనా స్టెప్ అయినా సరే అవలీలగా వేస్తాడని అతని సినిమాలకు కొరియోగ్రఫీ చేసే డ్యాన్స్ మాస్టర్లు చెబుతుంటారు. 

అసలు ఆర్ఆర్ఆర్‌లో నాటు నాటు సాంగ్‌కు అవార్డ్ రావడానికి కారణం కూడా ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్‌(Ram Charan)ల డ్యాన్సేనన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ను తాజాగా కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు విషెస్ చెప్పాడు. ఆస్కార్‌పై వెంటనే స్పందించని బన్నీకి విషెస్ చెప్పడమేంటంటూ మండిపడుతున్నారు. అలాగే చెర్రీ బర్త్‌డే పార్టీకి రాలేదని కొందరు.. ఆ తరువాత చెర్రీ(Ram Charan)కి ఎన్టీఆర్ పార్టీ ఇస్తే తను చేసిందాన్ని కప్పిపుచ్చుకోవడానికేనంటూ ట్రోల్ చేస్తున్నారు. 

కాదేదీ ట్రోల్‌కి అనర్హం అన్నట్టుగా ఉంది వ్యవహారం. అయితే ఎన్టీఆర్(NTR) మాత్రం ఎవ్వరినీ పట్టించుకోడు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే తొణకడు.. బెనకడు. ఇక సినిమాల విషయానికి వస్తే దెబ్బలు తగిలిన సరే నొప్పి భరిస్తూ డ్యాన్స్ లేదంటే ఫైట్ కంప్లీట్ చేస్తాడట. ఎలాంటి సీన్ అయినా సరే.. టేక్స్ తీసుకోవడమనేదే ఉండదని టాక్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 30 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తారక్ జాలరిగా కనిపించనున్నాడని టాక్. మొత్తానికి చాలా కాలం తర్వాత యంగ్ టైగర్ ఊర మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!