Pooja Hegde: సల్మాన్‌తో లవ్.. క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే..!

Pooja Hegde clarifies about love with Salman Khan

కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan).. పొడవు కాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి సల్మాన్‌(Salman Khan)తో కలిసి ఏ హీరోయిన్ నటించినా వారిద్దరి గురించి గాసిప్ రావడం సర్వసాధారణం. మనోడు అంతటి పులిహోర రాజా అని ఇండస్ట్రీలో టాక్. హీరోయిన్‌లతో క్లోజ్‌గా మెలిగే విధానం ఎదుటి వారికి అనుమానం తెప్పించక మానదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో పూజా హెగ్డే ‘కిసీ కా భాయ్‌ కిసీకా జాన్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన పాటల్లో సల్మాన్‌(Salman Khan), పూజ(Pooja Hegde)ల మధ్య కనిపించిన కెమిస్ట్రీ చూసిన వారంతా గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదు.. ఈ ఏడాది పూజా హెగ్డే సోదరుడి వివాహానికి సైతం సల్మాన్ హాజరవడం.. పూజాతో క్లోజ్‌గా మెలుగుతూ ఫోటో తీసుకోవడం వంటివి జరిగాయి. దీంతో వీరిద్దరి మధ్య ‘సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌’ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కనీసం వయసు భేదం కూడా చూడకుండా ఇద్దరికీ లింక్ పెట్టేశారు. 

Pooja Hegde clarifies about love with Salman Khan

ఇక సల్మాన్, పూజల(Pooja Hegde) మధ్య ఏదో ఉందంటూ ప్రచారం మరింత ఊపందుకోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమైపోయింది పూజా(Pooja Hegde). తాను ఎవరితోనూ ప్రేమలో లేనని సింగిల్ అని ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై వస్తున్న వదంతులను వింటున్నానని.. కానీ తానెవరినీ ప్రేమించడం లేదని తెలిపింది. తన దృష్టంతా కెరీర్ మీదే ఉందని స్పష్టం చేసింది. అన్ని భాషల్లో నటించాలనేదే తన లక్ష్యమని పేర్కొంది.

Google News