Vijay Deverakonda: విజయ్ దేవరొకండ ఆస్తులు ఎన్నో తెలిస్తే..

Vijay Deverakonda assets value

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. ఇండస్ట్రీలోకి వచ్చీ రాగానే హిట్ కొట్టాడు. ఇక నెక్ట్స్ సినిమాతోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈ యంగ్ హీరో ఇటీవలి కాలంలో ఎక్కువగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నప్పటికీ యూత్‌లో క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. రౌడీ హీరోగా ముద్ర వేసుకున్న విజయ్.. రెమ్యూనరేషన్ కూడా అగ్ర హీరోలకు సమానంగానే ఉంటుందని టాక్. 

ఇక లైగర్(Liger) సినిమాకు చాలా కష్టపడ్డాడు కానీ ఎందుకో ఈ సినిమాకు తొలిరోజునే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా హిట్ అయ్యుంటే మన రౌడీ హీరోకి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చి ఉండేది. ఈ సినిమా డిజాస్టర్‌తో ఆల్రెడీ లైన్‌లో ఉన్న ‘జనగణమన’ మూవీ కూడా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఖుషీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ కాస్త లేట్ అయ్యింది. 

Vijay Deverakonda assets value

అయితే తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు? యాడ్స్‌కి ఎంత తీసుకుంటున్నాడు? టోటల్‌గా ఆయనకు ఆస్తి పాస్తులు ఎంతున్నాయనే వివరాలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఒక్కో మూవీకి రూ.18 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. ఇక యాడ్స్ విషయానికి వస్తే.. ఒక్కో యాడ్‌కు రూ.2కోట్ల దాకా తీసుకుంటున్నాడట. విజయ్‌కు జూబ్లీహిల్స్‌లో రూ.16 కోట్ల విలువైన ఒక ఇల్లు, రూ.4.5 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా విజయ్‌కు రూ.135 కోట్ల ఆస్తులున్నాయని సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!