KGF 3: 1979 నుంచి 1981 వరకూ రాఖీభాయ్ ఎక్కడ? కేజీఎఫ్ 3పై క్లారిటీ వచ్చేసింది..

Yash in KGF3

కేజీఎఫ్ 2(KGF 2) సినిమాను చూసిన వారందరికీ కొన్ని ప్రశ్నలు మదిలో మెదులుతాయి. అవేంటంటే.. అసలు రాఖీ (హీరో యష్ Yash) ఇండో పసిఫిక్ సముద్రంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇండియన్ నేవి అధికారులతో పాటు ఇతర దేశాల అధికారులకు ఎందుకు ఇచ్చాడు? రాఖీ (Rakhi) సముద్రంలో మునిగిపోయిన అనంతరం సీఐఏ అధికారి ఎందుకు వచ్చాడు? తనను తాను అమెరికన్ కంపెనీ సీఈఓగా రమీకా సేన్‌కు రాఖీ ఎందుకు పరిచయం చేసుకున్నాడు? వంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి.

మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కేజీఎఫ్ 3 ఉండాల్సిందే. అయితే ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. కేజీఎఫ్(KGF) అంటే ఇంట్రస్టింగ్ మూవీ. ఇప్పటికే ఈ చిత్రం రెండు పార్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇండియా వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) చేసిన మ్యాజిక్ ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. అద్భుతమైన టేకింగ్‌తో సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే తాజాగా నిర్మాణ సంస్థ హోంబాళే ఒక వీడియో విడుదల చేసింది.

Yash in KGF

హోంబళే విడుదల చేసిన వీడియో కేజీఎఫ్ 2(KGF 2) లోని ఆసక్తికర సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఇక ఈ వీడియోనే కేజీఎఫ్ 3(KGF 3) ఉంటుందనడానికి నిదర్శనం. ఈ వీడియో ద్వారానే హోంబళే సంస్థ స్పష్టం చేసింది. బాహుబలి 1ని కట్టప్పని బాహుబలి ఎందుకు హత్య చేశాడన్న ఇంట్రస్టింగ్ పాయింట్‌తో రాజమౌళి ముగించిన విషయం తెలిసిందే. అలాగే హోంబళి సంస్థ విడుదల చేసిన వీడియోలో రాఖీ భాయ్ 1979 నుంచి 1981 వరకూ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నను సంధించింది. దీంతో సినిమాపై ఆసక్తి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!