ఎక్కడ చూసినా మెగాస్టార్.. ఇంతలా సెన్సేషన్ అవుతున్నారేం!

ఎక్కడ చూసినా మెగాస్టార్.. ఇంతలా సెన్సేషన్ అవుతున్నారేం!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైంది.. అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు. అయితే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు నుంచీ సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉంది. అయినా కూడా ఇప్పటి వరకూ చిరు హైలైట్ కాలేదు. ఎందుకో కానీ గత నాలుగైదు  రోజులుగా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాం చూసినా చిరుయే కనిపిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ప్రి రిలీజ్ ఈవెంట్ మొదలు.. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌పై చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన సతీమణి సురేఖకు కాల్ చేసి తన సూట్ పోయిందని.. అది దొరికిందంటూ సుమ సూట్‌పై పంచులు పేల్చారు. నానా రచ్చ చేసేస్తున్నారు. ఆ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండకూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నడూ లేనిది చాలా విషయాలు చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన అన్ని విషయాలు పంచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

చివరకు బాత్రూంలో అరిగిపోయిన సబ్బులన్నింటినీ స్క్వీజ్ చేసి మరీ వాడుకునే విషయంతో సహా పంచుకున్నారు. ఒకప్పుడు చెన్నైలో తాను హీరో అయ్యేందుకు ఇండస్ట్రీకి వచ్చానంటే తనను గేలి చేసిన విషయాన్ని ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీగా చెప్పారు. నిజంగా ఇది ఇప్పటి యూత్‌కి ఇన్‌స్పైరింగ్ స్టోరీయే. ఇలా తను ఎదుర్కొన్న అవమానాల నుంచి తాను హీరోగా సక్సెస్ అయ్యే వరకూ ప్రతి ఒక్క విషయాన్ని పంచుకున్నారు. తన సినిమా ప్రమోషన్‌ సమయంలో చెప్పారంటే అర్థముంది కానీ ఇలా ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి మరీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. చిరు ఇప్పుడెందుకు ఇంతలా సెన్సేషన్ అవుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో మాదిరిగా ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఈ క్రమంలోనే ఏదో ఒక విధంగా జనంలో ఉండేందుకు ట్రై చేస్తున్నారా? మరో కారణమా? అనేది చర్చనీయాంశమవుతోంది.

Google News