విజయ్.. ఏమిటీ బూతులు.. అహంకారమా..?

విజయ్.. ఏమిటీ బూతులు.. అహంకారమా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఇటీవలి కాలంలో విజయ్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అనేదే పడలేదు. ‘ఖుషీ’ కూడా ఓ రేంజ్ హిట్ అయితే అవలేదు. దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలని నానా తంటాలు పడుతున్నాడు. బీభత్సంగా ప్రమోషన్స్‌లో మునిగి తేలుతున్నాడు. చిత్ర యూనిట్ మొత్తం రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తోంది. చివరికి మెగాస్టార్ చిరంజీవిని కూడా రంగంలోకి దింపింది.

చిరుని విజయ్ ఇంటర్వ్యూ చేయడం సంచలనంగా మారింది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూసిన వీరిద్దరి ఇంటర్వ్యూనే నడుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ మొత్తం హాజరై గ్రాండ్ సక్సెస్ చేసింది. ఇక ఈ ఈవెంట్‌కు ప్రమోషన్స్‌ను మరింత విస్తృతం చేయాలనో మరొకటో కానీ బైక్ మీద విజయ్ దేవరకొండ వచ్చాడు. తనతో బైక్‌పై మృణాల్ ఠాకూర్‌ని సైతం తీసుకొచ్చాడు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే పప్పులో కాలేశాడు విజయ్. దీంతో నెటిజన్లు, అభిమానులతో తిట్లు తింటున్నాడు.

Advertisement
విజయ్.. ఏమిటీ బూతులు.. అహంకారమా..?

విజయ్ దేవరకొండ, మృణాల్ బైక్‌పై అలా వెళుతుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? పెద్ద ఎత్తున ఫాలో అయ్యారు. కనీసం ఈవెంట్‌కు వెళ్లేందుకు విజయ్‌కు దారి కూడా ఇవ్వలేదు. దీంతో విజయ్ ఒకింత అసహనంగా.. ‘జరగండ్రా నీయమ్మా’ అనేశాడు. ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీనిపై చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయ్. కొందరేమో అబ్బే విజయ్ అన్నది తప్పేం కాదని అంటుంటే..  ఇంత బలుపు మాటలెందుకనీ మరికొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి తెలంగాణలో ఇది కామన్ వర్డే కానీ ఒక వర్గం ఫ్యాన్స్ మాత్రం దీనిని లైట్ తీసుకోలేకపోతున్నారు. విజయ్‌పై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇంకా స్టార్‌డమ్ సంపాదించుకోలేక పోయావ్.. ఎందుకంత అహంకారమంటూ ఫైర్ అవుతున్నారు.