ఫ్యామిలీ స్టార్ ట్విటర్ రివ్యూ.. రౌడీ హీరో మరోసారి తప్పులో కాలేశాడా?

ఫ్యామిలీ స్టార్ ట్విటర్ రివ్యూ.. రౌడీ హీరో మరోసారి తప్పులో కాలేశాడా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబో అంటే ప్రేక్షకులంతా గీత గోవిందం సినిమాకు మించి లేదంటే ఆ రేంజ్ అయినా ఉండవచ్చు అనుకున్నారు. మరి ఫ్యామిలీ స్టార్ ఆ స్థాయిలో ఉందా? విజయ్, మృణాల్ ఠాకూర్‌లా జంట ప్రేక్షకులను మెప్పించిందా? సినిమా జనాల అంచనాలకు రీచ్ అయ్యిందా? వంటి విషయాలకు ట్విటర్ ద్వారా ప్రేక్షకులు సమాధానమిస్తున్నారు. 

ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే యూఎస్‌లో పడిపోయాయి. దీంతో అక్కడి ప్రేక్షకులు ట్విటర్ వేదికగా సినిమా ఎలా ఉందనేది చెబుతున్నారు. ఈ సినిమాపై మిశ్రమ స్పందన అయితే కనిపిస్తోంది. కొందరు ఇది సినిమానా.. లేదంటే సీరియలా? అంటుంటే.. మరికొందరు మాత్రం సినిమా బాగుందని.. కాకపోతే కాస్త మెల్లగా ఎక్కుతుందని అంటున్నారు. సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదని.. కనీసం ఆసక్తికర ఎలిమెంట్స్ కూడా లేవని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ ట్విటర్ రివ్యూ.. రౌడీ హీరో మరోసారి తప్పులో కాలేశాడా?

ఇదొక రొమ్ కామ్ మూవీ అని కొందరు చెబుతున్నారు. పర్వాలేదు.. కొంత వరకు టైం పాస్ అవుతుందని అంటున్నారు. అయితే సినిమాలో ఎమోషన్ పెద్దగా మెప్పించలేదట. ఇంటర్వెల్ వరకూ సీరియల్ మాదిరిగా.. ఆ తరువాత సెకండాఫ్ కాస్త ఫన్నీగానూ సాగుతుందట. మ్యూజిక్ కూడా సినిమాను దెబ్బేసిందంటున్నారు. కొందరైతే బిలో యావరేజ్ అని చెప్పేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్.. సెకండాఫ్ దారుణమని అంటున్నారు. అంచనాలు లేకుండా వెళ్లినా నిరుత్సాహమే కలిగిందని ఓ నెటిజన్ తెలిపాడు. ఓ నెటిజన్ అయితే విజయ్‌లో స్టఫ్ ఉన్నట్టుగా కనిపించలేదని.. ఓ బొమ్మలా ఉన్నాడనిపించిందని తెలిపారు. తాను చూసిన వరస్ట్ మూవీ ఇదేనని సదరు నెటిజన్ తెలిపాడు. ఇప్పటి వరకైతే ఫ్యామిలీ స్టార్ మూవీకి నెగిటివ్ రివ్యూనే ఎక్కువగా వినవస్తోంది. మరి ఫుల్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

Google News