ప్రభాస్ తండ్రి క్యారెక్టర్‌లో మెగాస్టార్?

ప్రభాస్ తండ్రి క్యారెక్టర్‌లో మెగాస్టార్?

సౌత్ ఇండియాలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు.  ప్రభాస్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు తర్వాత అని చెప్పాలి. అయితే  ఇక మీదట ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నాడు. బాహుబలి నుంచి కనీసం రెండేళ్లకు ఒక సినిమా కూడా ప్రభాస్ విడుదల చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు మాత్రం ఏడాదికి రెండు టార్గెట్ పెట్టుకున్నాడు. 

గత సంవత్సరం సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రభాస్. ఇక ఈ సంవత్సరం కల్కి, రాజాసాబ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని టాక్. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్రభాస్ సైన్ చేశాడు. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

ప్రభాస్ తండ్రి క్యారెక్టర్‌లో మెగాస్టార్?

ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్‌లో మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన మమ్ముట్టి నటించబోతున్నారట. ఇది చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ కావడంతో మమ్ముట్టిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. మమ్ముట్టి ఒక సీరియస్ క్యారెక్టర్ అయితే జీవించేస్తారు. అందుకే ఆయనను తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు ఒక ఏడాది సమయం పట్టొచ్చని అంటున్నారు.

Google News