Mrunal Thakur: క్యూ కడుతున్న ఆఫర్లు.. హైదరాబాద్‌కు మకాం మార్చనున్న మృణాల్..

Mrunal Thakur

హైదరాబాద్‌లో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సందడి చేయనుంది. ఇక మీదట తన మకాంను హైదరాబాద్‌ (Hyderabad) కు మార్చనుంది. ఈ బాలీవుడ్ దివా తన తదుపరి చిత్రంతో టాలీవుడ్‌ (Tollywood)ను షేక్ ఆడించేందుకు సిద్ధమవుతోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఒక లగ్జరీ హౌస్‌ను కొనుగోలు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారానే నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవాలని అమ్మడు ఆరాటపడుతోంది.

ఈ ముద్దుగుమ్మకు గతంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ‘సీతారామం’ (Seetharamam) వల్ల వచ్చిన గుర్తింపైతే రాలేదు. అందుకే అమ్మడు తన ఫోకస్ మొత్తం టాలీవుడ్‌పైనే పెట్టింది. ఇక అమ్మడి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. నాని (Nani)తో చేయబోయే చిత్రానికి ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటోందని టాక్. అమ్మడికి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత పెద్ద మొత్తాన్ని ముట్టజెప్పేందుకు సైతం నిర్మాతలు వెనుకాడటం లేదట.

Mrunal Thakur

మృణాల్‌(Mrunal Thakur)కు టాలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కట్టాయట. తనకు వస్తున్న వరుస ఆఫర్ల కారణంగా ఇక మీదట తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను కొనుగోలు చేసిందని టాక్. ఇప్పటికే నాని (Nani)తో మృణాల్ (Mrunal Thakur) చేయబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందట. ముందెన్నడూ చూడని పాత్రలో మృణాల్ దర్శనమిస్తుందని టాక్.

Google News