Nani: ఆ డైరెక్టర్లు నన్ను డ్రైవర్‌గా వాడుకున్నారు: నాని

Nani

ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఓకే కానీ లేకుండా మాత్రం నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. ఒకవేళ నిలదొక్కుకున్నా కూడా దాని వెనుక ఎన్నో అవమానాలు.. ఇబ్బందులు.. కష్టాలు అన్నీ ఇన్నీ ఉండవు. ఒకరకంగా ఒక నటుడి జీవితంలో అత్యంత దుర్భరమైన స్టేజ్ అదే కూడా అయ్యుండొచ్చు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అలా పైకి వచ్చిన వారే ఆ తర్వాత ఆక్ష్న మెగా హీరోలకు ఒక రాచ బాట వేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుంటే కొందరు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. స్టార్ హీరోలుగా ఎదుగుతారు వారిలో ఒకరు మాస్ మహరాజ్ రవితేజ (Raviteja).. మరొకరు నేచురల్ స్టార్ నాని (Nani). వీరిద్దరూ తొలి నాళ్లలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఆసక్తికరంగా ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్స్‌గానే తమ కెరీర్‌ను ప్రారంభించారు. తాజాగా వీరిద్దరూ ఒకరి సినిమా ప్రమోషన్స్‌ను మరొకరు నిర్వహించినట్టుంటుందని ఇద్దరూ కలిసి ఒకే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని తొలినాళ్లలో తాను పడిన కష్టాన్ని మీడియాతో పంచుకున్నాడు.

Nani In Dasara

తొలినాళ్లలో సినిమాల్లో అవకాశాలు కోసం తన ఫోటో ఆల్బంని పట్టుకొని తిరగని స్టూడియో అంటూ ఏదీ లేదట. ఏ స్టూడియోలో కూడా అవకాశం దొరక్క పోగా.. కనీసం ఎంట్రీ కూడా దక్కలేదట. అయితే తాను రోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతుండటాన్ని గమనించిన ఇద్దరు ప్రముఖ డైరెక్టర్లు తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి బీభత్సంగా తనను వాడుకున్నారని వెల్లడించాడు. డ్రైవర్‌గానూ.. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులకు కూడా తనను తిప్పేవారని వెల్లడించాడు. చివరికి తన పుట్టిన రోజు కోసం దాచుకున్న డబ్బులను సైతం వాళ్ల కోసమే ఖర్చు చేశానని నాని తెలిపాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!