Sana: కావాలని తప్పు చేయలేదు.. అనుకోకుండా జరిగిపోయింది.. యంగ్ హీరోతో రొమాన్స్ పై సనా రియాక్షన్..!

Sana Clarifies

నటీనటులకు ఈ సిన్నివేశాల్లోనే నటించాలి.. వీటిలో నటించకూడదనే రూల్ అంటూ ఏమీ ఉండదు. స్టార్ హీరోయిన్స్ అయితే రూల్స్ పెట్టినా పర్వాలేదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం అలాంటివేం వర్తించవు. దర్శకుడు ఏం చెబితే అది చేయాల్సిందే. లేదంటే నెక్ట్స్ సినిమాల్లో అవకాశం ఉండదు. కొందరు మాత్రం అవి చేయలేక ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటారు. కొందరు మనసు చంపుకుని నటిస్తున్నారు. కొంతకాలం క్రితం ‘మెట్రో కథలు’ అనే వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. 

ఆ వెబ్ సిరీస్‌లో నటి సన (Sana) ఒక రొమాంటిక్ సీన్‌లో నటించింది. దీనిపై బీభత్సంగా విమర్శలు వచ్చాయి. అసలా మూవీలో సీన్ ఏంటంటే.. సన తన భర్త కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంటుంది. సన భర్తను అలీ (Ali Reza) యాక్సిడెంట్ చేస్తాడు. విషయం తెలిసి సన.. అలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత అలీ తప్పేమీ లేదని తెలుసుకుంటుంది. సన (Actress Sana) కారు చెడిపోవడంతో అలీ తన కారులో ఆమెను ఇంటి వద్ద డ్రాప్ప చేస్తాడు. అలా వారి మధ్య బంధం బలపడుతుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఫిజికల్‌గా కూడా కలుస్తారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్‌పై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలోఆ సీన్ పై సన క్లారిటీ ఇచ్చింది. తను ఆ రోల్ చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్ (Karuna Kumar), రైటర్ ఖాదీర్ బాబు అని తెలిపింది. మిడిల్ క్లాస్ మహిళ స్ట్రగుల్ అయ్యే విధానం.. తాగుబోతు భర్తతో పడే ఇక్కట్లు.. బయట జనం ఏం మాట్లాడుకుంటారు? ఇంటి బాధ్యతలతో పాటు.. లోలోపల కోరికలు వంటివి చూపించడం జరిగిందని సన (Sana) వెల్లడించింది. తన పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారని… మంచి మెసేజ్ ఉందని తెలిపింది. మంచి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. తన పాత్ర కావాలని తప్పు చేయదని.. అనుకోకుండా అలా జరుగుతుందని.. చిన్న వీక్ మూమెంట్ లో చేసిన తప్పు అది అని సన వెల్లడించింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!