Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్‌ను పవన్ కల్యాణ్‌తో పోల్చుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..

Netizens are comparing Bellamkonda Srinivas with Pawan Kalyan

అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas).. ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక (Jaya Janaki Nayaka) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించాడు కానీ స్టార్ డమ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Srinivas)కి ఇప్పటి వరకైతే బ్లాక్ బస్టర్ హిట్ అనేది పడలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే తన అదృష్టం పరీక్షించుకునేందుకు బాలీవుడ్‌పై ఫోకస్ చేశాడు.

బాలీవుడ్‌లో ఛత్రపతి(Chatrapathi) సినిమాతో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మనోడికి ఎందుకోగానీ బాలీవుడ్‌లో ఫ్యాన్స్.. టాలీవుడ్‌తో పోలిస్తే కాస్తంత ఎక్కువగానే ఉన్నారు. జయ జానకీ నాయక (Jaya Janaki Nayaka) సినిమా యూట్యూబ్‌లోకి వచ్చేసిన సమయంలో ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు వేలం వెర్రిలా చూశారు. దీంతో అక్కడ అభిమానులు కూడా బీభత్సంగా పెరిగిపోయారు. ఇక ఆ తర్వాతే మనోడికి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలన్న కోరిక కలిగింది. దీంతో ఛత్రపతి సినిమా బాలీవుడ్ రీమేక్‌లో నటించాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై.. మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. కాగా.. ఈ సినిమా కోసం ముంబైలోనే ఉండిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) తాజాగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రాయానికి కి చేరుకుని శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. సెల్ఫీల కోసమే కాదు.. పూలదండలు వేసేందుకు సైతం ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్‌కు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Google News