Ravanasura: విడుదలకు ముందు ‘రావణాసుర’ చిత్రంపై ఈ ప్రచారమేంటి?

Raviteja's Ravanasura

ధమాకా (Dhamaka), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలు వరుసగా హిట్ అవడంతో మాస్ మహరాజ్ రవితేజ మాంచి ఊపుమీదున్నారు. నెక్ట్స్ రావణాసుర (Ravanasura) మూవీతో హ్యాట్రిక్ కొట్టడమేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే తాజాగా రావణాసుర (Ravanasura) గురించి ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం బెంగాలీ చిత్రానికి రీమేక్ అని టాక్ నడుస్తోంది. రీమే క్ అయితే చిత్ర యూనిట్ చెప్పేది కదా. విడుదల సమయంలో ఈ ప్రచారం ఏంటి? మరి ఈ ప్రచారం ఏంటి? నిజానికి ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నాలుగేళ్ళ క్రితం విడుదలైన బెంగాలీలో విడుదలైన విన్సీ డా బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రాన్నే రావణాసుర (Ravanasura)గా రీమేక్ చేశారని టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) స్పందించారు. రావణాసుర (Ravanasura) రీమేక్ అంటూ వస్తున్న వార్తలను వట్టి పుకార్లుగానే కొట్టిపడేశారు. రావణాసుర వంటి మూవీ గతంలో ఎన్నడూ రాలేదని.. చిత్రాన్ని చూశాక పోలికలుంటే తనను అడగాలని స్పష్టం చేశారు. రావణాసుర ఒక స్ట్రెయిట్ మూవీ అని సుధీర్ వర్మ తేల్చి చెప్పారు.

Ravanasura theme

ఇప్పటికే సెన్సార్ ఆమోదం పొందిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఇలాంటి ప్రచారం చిత్రానికి ఏమైనా డ్యామేజ్ చేస్తుందనే ఆందోళనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ చిత్రంలో వయలెన్స్ ఎక్కువగా ఉండటం వల్లనో.. మరో కారణమో కానీ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. లాయర్‌గా అలరించనున్నాడట. మొత్తానికి సినిమాపై ఫ్యాన్స్ అయితే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. లాయర్‌గా రవితేజ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!