Venkatesh: హీరో విక్టరీ వెంకటేష్ ఇంట విషాదం

Hero Venkatesh

హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు (73) కన్నుమూశారు. కొంతకాలంగా మోహన్‌బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేటి తెల్లవారుజామున మోహన్ బాబు పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. మోహన్‌బాబు (Mohan Babu) తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలోనే కన్నుమూశారు. మోహన్‌బాబు మరణ వార్త తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులంతా కారంచేడు చేరుకున్నారు. 

అయితే వెంకటేష్ (Venkatesh) మాత్రం సినిమా షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం ముంబైలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన వచ్చాక అంత్యక్రియలు కారంచేడులో నిర్వహించనున్నారని తెలుస్తోంది. సురేష్‌బాబు (Suresh Babu), ఆయన కుమారుడు అభిరామ్ (Abhiram) మాత్రం కారంచేడుకు వెళ్లారు. చీరాలలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక థియేటర్ ఉంది. దాని నిర్వహణ బాధ్యతలన్నీ మోహన్‌‌బాబే చూసుకుంటారని సమాచారం. మోహన్ బాబు మరణంతో వెంకటేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Hero Venkatesh uncle Mohan Babu passes away

విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దగ్గుబాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక వెంకీ వచ్చేసి ప్రస్తుతం సైంధవ్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. శైలేష్ కొలను సైంధవ్ చిత్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శైలేష్ దర్శకత్వం వహించిన హిట్, హిట్ 2 చిత్రాలు మంచి సక్సెస్ సాధించడంతో సైంధవ్‌పై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. వెంకీకి తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం గమనార్హం. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

Google News