Dasara: ‘దసరా’ మూవీ డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Producer gives costly gift to Dasara director Srikanth Odela

నేచురల్ స్టార్ నాని (Hero Nani) ఖాతాలో మరో హిట్ పడిపోయింది. దసరా మూవీ (Dasara Movie) మంచి సక్సెస్ సాధించింది. కొంతకాలంగా అటు నిర్మాత చెరుకూరి సుధాకర్‌ (Cherukuri Sudhakar)కు కానీ.. ఇటు నాని (Nani)కి కానీ హిట్స్ అనేవి లేవు. దసరా మూవీతో ఇద్దరూ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఒక్కసారే ప్యాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మార్చి 30న రిలీజైన ఈ మూవీ వసూళ్ల సునామీతో దూసుకెళుతోంది. దీంతో నాని, నిర్మాత సుధాకర్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి.

Dasara 1st Day Collections

ఈ క్రమంలోనే నిర్మాత సుధాకర్.. దర్శకుడితోపాటు సినిమా కోసం పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ అందరికీ ఖరీదైన గిఫ్ట్‌లు అందజేశారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తొలి సినిమాతోనే మాంచి హిట్ కొట్టి ఫుల్ ఖుషీగా ఉంటే.. దీనికి తోడు నిర్మాత సుధాకర్ (Producer Sudhakar) ఆయనకు రూ. 80 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్‌గా ఇచ్చి మరింత ఖుషీ చేశారని టాక్. 

Dasara team

ఇక దసరా మూవీ (Dasara Movie) కోసం పని చేసిన కొందరు కీలక మెంబర్స్‌కి ఒక్కొక్కరికీ 10 గ్రాముల చొప్పున గోల్డ్ కాయిన్స్ అందించారని తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెలకు సంబంధించి ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది. ఇక దసరా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో సినిమా చేయనున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్‌తో ఓ మూవీ కమిట్ అయ్యారట. మొత్తానికి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) రూపంలో ఇండస్ట్రీకి మరో మంచి డైరెక్టర్ దొరికినట్టేనని సోషల్ మీడియా చర్చించుకుంటోంది.

ఇవీ చదవండి:

Dasara: దసరా.. టైటిల్లో ఉన్నంత పండగ.. సినిమాలో లేదా.. వామ్మో ఇదెక్కడి రివ్యూరా బాబోయ్..!

Dasara 1st Day Collections: తొలిరోజున ‘దసరా’కు కలెక్షన్స్ సునామీ.. ఎన్ని కోట్లు కొట్టిందంటే..!

Dasara Review & Ratings: దసరా మూవీ రివ్యూ & రేటింగ్

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!