Mahesh Babu: మహేష్ బాబు చాలా డేంజరస్ పర్సన్ అంటున్న స్టార్ డైరెక్టర్..

Star director about Mahesh Babu

టాలీవుడ్‌లో అద్భుతమైన నటుల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పేరు ముందు వరుసలో ఉంటుంది. అంతేకాదు.. ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి విషయాల్లో మహేష్ పేరు మనకు ముందు కనిపిస్తుంది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఎదిగి ఆపై పెద్దగా సమయం తీసుకోకుండానే స్టార్స్ సరసన కూర్చొన్నాడు. ఒక్కడు, పోకిరి చిత్రాలు మహేష్ (Mahesh Babu) కెరీర్‌కి తిరుగులేని టర్న్ ఇచ్చాయి. మహేష్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే స్థాయికి ఎదిగాడు.

తాజాగా మహేష్ బాబుతో ‘ఒక్కడు’ (Okkadu) లాంటి ల్యాండ్ మార్క్ సినిమా తీసిన డైరెక్టర్ గుణ శేఖర్ (Gunasekhar) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్‌గా గుణశేఖర్ మహేష్ బాబు గురించి చేసిన కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Director Gunasekhar

మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని గుణశేఖర్ పేర్కొన్నారు. ఒక్కసారి ఆయనతో సినిమా చేశామంటే చాలు… ఆయనకు అడిక్ట్ అయిపోయి.. మళ్లీ మళ్లీ ఆయనతోనే సినిమా చెయ్యాలనిపిస్తుందన్నారు. అలా ఇప్పటి వరకూ మహేష్‌ (Mahesh Babu)తో తాను ఒక్కడు (Okkadu), అర్జున్ (Arjun), సైనికుడు (Sainikudu) వంటి సినిమాలు తీశానని వెల్లడించారు. ఇలా ఈ తరం హీరోలలో ఒక డైరెక్టర్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోని ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. ఇక కేవలం మహేష్‌తోనే సినిమాలు చేస్తే బాగోదని కాస్త గ్యాప్ తీసుకున్నానని గుణశేఖర్ (Gunasekhar) వెల్లడించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!