Venu Yeldandi: తెలంగాణలో పెట్టి పెరిగా.. దొంగిలించాల్సిన అవసరం నాకు లేదు: వేణు
ఇటీవలి కాలంలో దుమ్ము రేపిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘బలగం’ (Balagam). చిన్న సినిమా అయినా దర్శకుడికి పెద్ద పేరే తెచ్చిపెట్టింది. కామెడియన్‌గా ఇప్పటి వరకూ మనం చూసిన వేణు..(Venu Yeldandi) ఇప్పుడు తనలో దర్శఖుడు, డైరెక్టర్ ఉన్నాడని బలగం (Balagam) సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. వేణు (Venu Yeldandi)కి ఎక్కడికెళ్లినా సన్మానాలు, సత్కారాలతో జనం జేజేలు పలుకుతున్నారు. ఇక పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టుగా ఒకరికి అద్భుతంగా పేరు వచ్చిందంటే రాళ్లేసేవాళ్లు కూడా తయారవుతారు కదా.
ఓ జర్నలిస్ట్ బలగం సినిమా కథ తనది అంటూ ఓ సంచలనానికి తెరదీశాడు. తన కలం నుంచి జాలు వారిన ఓ కథ ఒక దిన పత్రికలో ప్రచురితమైందని.. అది చూసి వేణు (Venu Yeldandi) సినిమా తీశాడని పేర్కొన్నారు. కమెడియన్ వేణు తన కథను దొంగిలించాడంటూ ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా వేణు స్పందించాడు. జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై వేణు ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. ఒక పెళ్లి తంతు అనేది ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుందని అంత మాత్రాన అది తమ కుటుంబానికే చెందినదంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
అలాగే చావు తంతు కూడా తెలంగాణలో ఎక్కడికెళ్లినా సేమ్ ఉంటుందని అంత మాత్రాన తన కథను దొంగిలించాననడం సరికాదని వేణు (Venu Yeldandi) తెలిపారు. తాను పుట్టి పెరిగిందంటూ పక్కా తెలంగాణలోనేని.. ఇక్కడి సంప్రదాయాలను, ఆచారాలను చూస్తూ పెరిగానని.. కాబట్టి ఎవరో రాస్తేనే.. చెబితేనో తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను సిరిసిల్ల కూరగాయల మార్కెట్లో పనిచేశానని.. భవన నిర్మాణ పనుల్లో తట్టలు మోశాన.. అలాంటి తాను తప్పుుడు పనులు ఎప్పుడూ చేయనని అన్నారు. వేణు కామెంట్స్‌కు అభిమానులు సైతం మద్దతుగా నిలుస్తున్నారు.